మెరుస్తున్న పల్లెసీమలు

పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల ముఖచిత్రం మారుతున్న ది. సీఎం పిలుపుమేరకు సబ్బండ వర్ణా లు ఏకమై చేపడుతు న్న శ్రమదానం కా ర్యక్రమాలతో పల్లెల్లో పరిశుభ్రత వెల్లివిరుస్తున్నది. ము ఖ్యంగా రోడ్లు, మురుగు కాల్వల నిర్వహణలో మార్పు కన్పిస్తున్నది. హరితహారంలో భాగంగా నాటుతున్న మొక్కలతో గ్రామాలకు పచ్చందం వస్తున్నది. రెండో విడుతలో భాగంగా ఐదో రోజైన సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జోరుగా జరిగింది. పలు జిల్లాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌, సత్యవతి రాథోడ్‌ పాల్గొని శ్రమదానం చేపట్టారు. పల్లెప్రగతి అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్టిన ఊరి రుణం తీర్చుకునేందుకు పలువురు విరాళాలు ఇచ్చారు.


పల్లె ప్రగతి పనులు జోరుగా సాగుతున్నాయి. సోమవారం రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో మంత్రులు, ఉన్నతాధికారులు శ్రమదానాల్లో పాల్గొని గ్రామస్థుల్లో ఉత్సాహం నింపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి పల్లెప్రగతిలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం గంగోలు గ్రామంలో నిర్వహించిన సభలో మంత్రి సత్యవతిరాథోడ్‌తో కలిసి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ సం దర్భంగా గ్రామంలో పారిశుద్ధ్య పనుల కోసం పువ్వాడ ఫౌండేషన్‌ తరఫున మంత్రి రూ.5 లక్షలను విరాళమిచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పాల్గొన్నారు.