ఆపద వస్తే అన్నివేళలా తమకి అండగా నిలుస్తామని నిరూపిస్తున్నారు సెలబ్రిటీలు. కరోనా కారణంగా దేశం చిన్నా భిన్నం అవుతున్న తరణంలో ప్రభుత్వంకి అండగా నిలుస్తూ తమకి తోచినంత సాయాలు చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ రూ. 2 కోట్లు, మహేష్ బాబు కోటి రూపాయలు, రామ్ చరణ్ 70 లక్షల రూపాయలు, నితిన్ 10 లక్షల రూపాయలు, దర్శకుడు త్రివిక్రమ్ రూ. 20 లక్షలు, దర్శకుడు అనిల్ రావిపూడి రూ. 10 లక్షలు, దిల్ రాజు రూ.10 లక్షలు , సాయిధరమ్ తేజ్ రూ. 10 లక్షలు ఇస్తామని ప్రకటించారు.
తనని ఇంత రేంజ్‌లో నిలిపిన అభిమానుల కృతజ్ఞత తీర్చుకునే సమయం వచ్చిందని భావించిన ప్రభాస్ ఏకంగా రూ.4 కోట్ల రూపాయల వితరణం ఇస్తున్నట్టు ప్రకటించారు. రూ.4 కోట్లలో ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ.3 కోట్లు విరాళంగా ఇస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కి, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. 50 లక్షల చొప్పున ఇస్తున్నట్టు ప్రకటించారు. నిజానికి మొదట ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కలిపి కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు ప్రభాస్. కానీ, గురువారం అర్ధరాత్రి సమయంలో మరో ప్రకటన వచ్చింది. ప్రధాన మంత్రి సహాయ నిధికి కూడా రూ.3 కోట్లు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు.