రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలకు కూరగాయలను అందుబాటులో ఉంచేందుకు ఇండ్లవద్దనే రైతుబజార్లు నిర్వహించేలా రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ ఏర్పాట్లుచేసింది. హైదరాబాద్‌లో 109 ప్రాంతాల్లో 63 వాహనాలతో మొబైల్ రైతుబజార్ల ద్వారా వినియోగదారులకు కూరగాయలు సరఫరాకు చర్యలు చేపట్టారు. ఈ వాహనాల ద్వారా బస్తీలు, కాలనీలు, అపార్ట్‌మెంట్ల వద్దకు వెళ్లి కూరగాయలను విక్రయిస్తారు. గురువారం బీఆర్కే భవన్‌లో వ్యవసాయ, మార్కెటింగ్, రోడ్డు-రవాణా, పోలీసుశాఖ ఉన్నతాధికారులతో కూడిన ధరల నియంత్రణ కమిటీ సభ్యులతో వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి సమీక్షా నిర్వహించారు.
ఇంటిముందుకే రైతుబజార్