రైతులు ఆందోళన చెందొద్దు: మంత్రి జగదీశ్‌ రెడ్డి

బత్తాయి, నిమ్మ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. నల్లగొండ బత్తాయి మార్కెట్‌లో బత్తాయి కొనుగోళ్లను ఆయన ప్రారంభించారు. బత్తాయి, నిమ్మ కొనుగోళ్లు సజావుగా జరిగేలా, అవి ఇతర రాష్ర్టాలకు ఎగుమతి అయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ సజావుగా సాగుతున్నదని, రవాణా సౌకర్యంతోపాటు తగినన్ని గన్నీ బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. రైతులపై లాక్‌డౌన్‌ ప్రభావం పడకుండా సీఎం కేసీఆర్‌ శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలంతా మే 7 వరకు లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించాలని సూచించారు.